సుహాస్ .. జనక అయితే గనక మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల

సుహాస్ .. జనక అయితే గనక మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల

సుహాస్, సంగీర్తన జంటగా సందీప్ రెడ్డి బండ్ల రూపొందించిన చిత్రం ‘జనక అయితే గనక’.  దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శిరీష్ స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ర్పణ‌‌‌‌‌‌‌‌లో హ‌‌‌‌‌‌‌‌ర్షిత్ రెడ్డి, హ‌‌‌‌‌‌‌‌న్షిత నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 7న సినిమా రిలీజ్. మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. పెళ్లైనా పిల్లలు వద్దనుకునే పాత్రలో  సుహాస్ కనిపించాడు. వాషింగ్ మెషీన్ మెకానిక్‌‌‌‌‌‌‌‌గా సుహాస్ నటించగా,  అతని భార్యగా సంగీర్తన,  తండ్రి పాత్రలో గోపరాజు రమణ ముఖ్య పాత్రలు పోషించారు. 

పిల్లలు ఉంటే  ఖర్చు ఎక్కువ అవుతుందని భావించే సుహాస్.. పిల్లలు వద్దనుకుని కండోమ్‌‌‌‌‌‌‌‌ను వాడుతుంటాడు. కానీ అనుకోకుండా అతని భార్య కన్సీవ్ అవడంతో ఆ కండోమ్ కంపెనీపై కేసు వేస్తాడు సుహాస్. ఈ కేసును వాదించే లాయర్లుగా వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను నటించగా,  జడ్జిగా రాజేంద్ర ప్రసాద్ కనిపించారు.  విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కావల్సినంత కామెడీ ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు.