21వ అంతస్తు నుంచి దూకి ట్రైనీ డాక్టర్ సూసైడ్

21వ అంతస్తు నుంచి దూకి ట్రైనీ డాక్టర్ సూసైడ్
  • గ్రేటర్ నోయిడాలో ఘటన

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్​లోని గ్రేటర్  నోయిడాలో ఘోరం జరిగింది. ఓ ట్రైనీ డాక్టర్  21వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మథురకు చెందిన శివ (29).. గ్రేటర్  నోయిడాలోని గౌర్ సిటీ2లో నివాసం ఉంటున్న తన సోదరి ఇంటికి వచ్చాడు. 

మధ్యాహ్నం ఇంట్లో పేరెంట్స్ ఓ గదిలో ఉండగా.. శివ బాల్కనీలోకి వెళ్లాడు. ఆపై అక్కడి నుంచి దూకేశాడు.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శివను హాస్పిటల్​కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

ఇంట్లో ఎలాంటి సూసైడ్  నోట్  దొరకలేదని పోలీసులు తెలిపారు. కాగా.. శివ 2015లో ఢిల్లీలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్  చేస్తున్నాడు. ట్రైనీ డాక్టర్​గా ఉన్న టైంలో ఆయన మానసిక సమస్యలు, ఆందోళనతో బాధపడుతున్నారు. ఈ కారణాల వల్లే శివ సూసైడ్ చేసుకుని 
ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.