ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: ట్రైనీ మహిళా ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తరలించి విచారిస్తున్నారు. మహిళా ఐపీఎస్ ఫిర్యాదుతో ఈ నెల 18న అత్తాపూర్ పీఎస్​లో కేసు నమోదైంది. ఆపై మరుసటి రోజు అధిక మొత్తంలో మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

డైరీలో సూసైడ్ నోట్ రాయడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రచారం జరిగింది. ఎస్​ఆర్ నగర్​లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్​లో రెండ్రోజులపాటు చికిత్స పొందుతూనే హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్​పై పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. గత వారం రోజులుగా పరారీలో ఉన్న ఉదయ్ కృష్ణను నాటకీయ పరిణామాల మధ్య మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు.