చైనా, ఉక్రెయిన్ మెడిసిన్  స్టూడెంట్లకు ఇక్కడే ట్రైనింగ్!

చైనా, ఉక్రెయిన్ మెడిసిన్  స్టూడెంట్లకు ఇక్కడే ట్రైనింగ్!
  • క్లినికల్ ఎక్స్‌‌‌‌పోజర్ కోసం ప్రైవేటు సాయం
  • అసిస్టెంట్లుగా చేర్చుకునేందుకు సిద్ధమవుతున్న హాస్పిటళ్లు
  • 70 రోజుల కోర్సుకు  ఏర్పాట్లు
  • యాజమాన్యాలతో చర్చిస్తున్న ఎఫ్‌‌‌‌ఎంజీ అసోసియేషన్
  • అనుమతివ్వాలని సర్కార్‌‌‌‌‌‌‌‌కు వినతి


హైదరాబాద్, వెలుగు: చైనా, ఉక్రెయిన్‌‌‌‌ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన మెడికల్ స్టూడెంట్లను ఆదుకునేందుకు ప్రైవేటు ఆస్పత్రులు మందుకొస్తున్నాయి. తమ హాస్పిటళ్లలో క్లినికల్ అసిస్టెంట్లుగా చేర్చుకుని మెడికోలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు 70 రోజుల కోర్సును కూడా రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందుకు స్టూడెంట్లు దాదాపు రూ.50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతానికి హైదరాబాద్‌‌‌‌లోని 2 హాస్పిటళ్లు ట్రైనింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతుండగా.. మరిన్ని దవాఖాన్లతో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఎంజీఏ) ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే రెండు దేశాల నుంచి తిరగొచ్చిన సుమారు 3 వేల మంది స్టూడెంట్లకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు.

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే క్లాసులు.. ఎగ్జామ్స్‌‌‌‌

చైనాలో మెడిసిన్ చేస్తున్న మన దేశ స్టూడెంట్లు, కరోనా కారణంగా 2020లో ఇండియాకు తిరిగొచ్చేశారు. అక్కడి కాలేజీలు ఆన్​లైన్​లోనే క్లాసులు, పరీక్షలు నిర్వహిస్తున్నాయి. చైనా నుంచి వచ్చేటప్పుడు ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్​లో ఉన్న స్టూడెంట్ల మెడికల్ కోర్సులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే పూర్తయ్యాయి. అప్పుడు ఫస్ట్ ఇయర్‌‌‌‌, సెకండ్‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న స్టూడెంట్లు, ఇప్పుడు ఫోర్త్‌‌‌‌ ఇయర్‌‌‌‌, ఫిఫ్త్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చేశారు. ఇప్పుడు చైనాలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దీంతో అక్కడికి ఎప్పుడు తిరిగి వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. రష్యా దాడితో ఉక్రెయిన్‌‌‌‌లో చదువుతున్న స్టూడెంట్స్‌‌‌‌ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. రష్యా దాడి మొదలైనంక స్టూడెంట్స్‌‌‌‌ అంతా ఇండియాకు వచ్చేశారు. తిరిగి ఎప్పుడు ఆ దేశానికి వెళ్తారో తెల్వని పరిస్థితి. వీళ్లకు కనీసం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్లాసులు కూడా జరగట్లేదు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన స్టూడెంట్లకు ఇక్కడే చదువుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, నేషనల్ మెడికల్ కమిషన్​ను కోరాయి. కానీ, వేల మంది స్టూడెంట్లను ఇక్కడి కాలేజీల్లో చేర్పించడం సాధ్యమయ్యే పని కాదని మెడికల్ ఎక్స్‌‌‌‌పర్ట్స్ చెప్తున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చినోళ్లకు పర్మిషన్ ఇస్తే, చైనా నుంచి వచ్చిన స్టూడెంట్లకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. రెండు దేశాల నుంచి దాదాపు 40 వేల మంది మెడికల్ స్టూడెంట్స్‌‌‌‌ ఉన్నారు. 

ఇక్కడే నిర్వహించాలంటున్న స్టూడెంట్స్

చైనా నిర్వహిస్తున్న ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్లాసులు, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌ను ఎన్‌‌‌‌ఎంసీ గుర్తిస్తోంది. యుద్ధం తర్వాత ఉక్రెయిన్ కాలేజీలు క్లాసులు నిర్వహించినా ఓకే చేస్తుండొచ్చు. కానీ, ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం ఆయా దేశాల్లో, అదే కాలేజీకి వెళ్లి చేయాలని చెప్తోంది. ఈ రూల్‌‌‌‌ను మార్చి ఇక్కడే ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌‌‌‌ పెట్టాలని, తొలుత ఇక్కడి హాస్పిటళ్లలో తాము ట్రైనింగ్ తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చి, ఆ తర్వాత ఎగ్జామ్స్ పెట్టాలని స్టూడెంట్లు కోరుతున్నారు. ఆ తర్వాత ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్(ఎఫ్‌‌‌‌ఎంజీఈ) రాసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటున్నారు. ఎన్‌‌‌‌ఎంసీ రూల్స్ ప్రకారం ఎఫ్‌‌‌‌ఎంజీఈ పాస్ అయిన తర్వాతే డాక్టర్‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఇంటర్న్‌‌‌‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌‌‌‌షిప్ పూర్తయ్యాక ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలు ఉంటుంది.

రెండేండ్ల నుంచి స్ట్రగుల్

ఇప్పుడు అంతా ఉక్రెయిన్ స్టూడెంట్ల గురించే మాట్లాడుతున్నారు. రెండేండ్ల నుంచి మేమూ స్ట్రగుల్ అవుతున్నాం. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్లాసులు తప్పితే క్లినికల్ ఎక్స్‌‌‌‌పోజర్ లేనేలేదు. మాలో కొంత మందికి కనీసం ఇంజక్షన్ వేసుడు కూడా రాదు. మా ఎఫ్‌‌‌‌ఎంజీ అసోసియేషన్ సాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. 70 రోజుల ట్రైనింగ్‌‌‌‌లో జాయిన్ అవడానికి రెడీ అవుతున్నాం. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఇంకా ఎక్కువ హాస్పిటల్స్‌‌‌‌ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటాయి. మాకు కొంత వరకైనా నేర్చుకునేందుకు అవకాశం దొరుకుతుంది.
- ధనుష్‌‌‌‌, మెడికో(చైనా), హైదరాబాద్‌‌‌‌