ఈ నెల 14 వరకు పలు రైళ్లు రద్దు

ఈ నెల 14 వరకు పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు: ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదంతో ఖరగ్ పూర్- భద్రక్ సెక్షన్ల మధ్య ఉన్న బహనాగా బజార్ రైల్వే స్టేషన్​రైల్వే ట్రాక్ పునరుద్ధణ పనుల నేపథ్యంలో14 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. హైదరాబాద్– షాలీమార్, ఎర్నాకులం- – హౌరా, సంత్రగచ్చి-– తంబ్రమ్, హౌరా – -చెన్నై సెంట్రల్​ఎక్స్​ప్రెస్ రైళ్లను ఈనెల12న రద్దు చేశారు. సంత్రగచ్చి– చెన్నై సెంట్రల్, హౌరా-– ఎస్ఎంవీటీ బెంగళూరు, షాలీమార్– చెన్నై సెంట్రల్,  షాలీమార్– హైదరాబాద్, సికింద్రాబాద్– -షాలీమార్, హైదరాబాద్​– షాలీమార్, విల్లూపురం- – ఖరగ్​పూర్ మధ్య నడిచే ఎక్స్​ప్రెస్​ రైళ్లను ఈనెల13 వరకు రద్దు చేశారు. అలాగే ఎస్ఎంవీటీ బెంగళూరు – హౌరా, భగల్​పూర్– -ఎల్ఎంవీటీ బెంగళూరు, షాలీమార్– సికింద్రాబాద్ మధ్య నడిచే ఎక్స్​ప్రెస్​రైళ్లను ఈ నెల14న రద్దు చేశారు. చెన్నై సెంట్రల్– షాలీమార్ మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ ను ఈనెల12 నుంచి యథావిధిగా నడుపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.