భారీగా ఐఏఎస్ల బదిలీ..పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు..

భారీగా ఐఏఎస్ల బదిలీ..పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు..

తెలంగాణలో  భారీగా  ఐఏఎస్‌ లను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ గా భారతి హోళికేరిని నియమించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్‌,  ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, నిజామాబాద్‌ కలెక్టర్‌గా రాజీవ్‌ గాంధీ హనుమంతు,  వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌ కుమార్‌ (హైదరాబాద్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు),  రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.హరీశ్‌,కుమురంభీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా యాస్మిన్‌ బాషా, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌గా జి.రవి, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.వెంకటరావులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.