పీఎఫ్ పేరుతో ట్రాప్ చేసి రూ.9 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

పీఎఫ్  పేరుతో  ట్రాప్ చేసి రూ.9 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

రోజురోజుకి సైబర్ నేరగాళ్లు మోసాలు ఎక్కువవుతున్నాయి.. లేనిపోని ఆశలు చూపి లక్షలు కాజేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రభుత్వ రిటైర్డ్  మహిళా ఉద్యోగిని  పిఎఫ్ పేరుతో ట్రాప్ చేసి రూ. 9 లక్షలు కాజేశారు. ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం నుండి ఫోన్ చేస్తున్నామంటూ గాంధీ నగర్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి సునీత నమ్మించారు. మీకు రావలసిన పీఎఫ్ డబ్బులు బ్యాంకులో జమ  చేస్తామని,   టాక్స్ డబ్బులు  ముందుగానే ఆన్ లైన్ ద్వారా  చెల్లించాలని  చెప్పి   బ్యాంక్ డెబిట్ కార్డు cvv నెంబర్లు తీసుకున్నారు. ఆమె ఫోన్ కి వచ్చిన  ఓటిపి  నెంబర్లు కూడా తీసుకుని నాలుగు విడతలుగా మొత్తం రూ.9 లక్షలు  దోచేశారు. ఫోన్ స్విచాఫ్ రావడంతో   మోసపోయానని గ్రహించి సిటీ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.