ఓహో.. చైనా చాలా ఫాస్ట్ ఫుడ్ డెలివరీ చేస్తున్న రోబో

ఓహో.. చైనా చాలా ఫాస్ట్  ఫుడ్ డెలివరీ చేస్తున్న రోబో

చైనా టెక్నాలజీని వాడుకోవడంలో కాస్త ముందుంటుంది. ఫేమస్ ట్రావెలర్ కేన్ అబ్రాడ్ తనను ఆశ్చర్య పరిచిన ఓ వీడియోని ఇస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. చైనాలోని షాంగై నగరంలో కేన్ ఓ హాటల్ లో రూం తీసుకొని ఉన్నాడు. రూంలో వ్లాగర్ వీడియో చేస్తుంటే సడ్డన్ గా డోర్ నుంచి ఓ వాయిస్ వచ్చింది. కేన్ ఏంటా అని తలుపు ఓపెన్ చేసి చూడగా షాక్ అయ్యాడు. 


ఓ రోబోట్ కేన్ ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొచ్చింది. కస్టమర్ కోసం వెయిట్ చేస్తుంది. కేన్ రోబోకి ఉన్న  ఓ బటన్ నొక్కగానే ఓ బాక్స్ తెరుచుకుంది. ఆయన ఆడ్డర్ చేసిన ఆహారం వేడి వేడిగా డెలివరీ చేసింది. వెంటనే అక్కడి నుంచి వెళ్లింది. ఈ వీడియోని కేన్ తన ఇస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దీనికి చాలా కామెంట్స్ వచ్చాయి. చైనా, జపాన్ దేశాలు చాలా అడ్వాస్డ్ గా ఉంటాయని మరొ నెటిజన్ కామెంట్ చేశాడు. ఏఐ ప్రపంచాన్ని ఏలబోతుందా అని, ఆ ఫుడ్ రోబో వండిందా సందేహాలతో ఆ వీడియో వైరలైంది. 

ALSO READ :- ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయండి.. సీఎం రేవంత్ కు కేటీఆర్ లేఖ