పెట్స్తో కలిసి ట్రిప్కి వెళ్తున్నారా.. అయితే ఇవి మీకోసమే..

పెట్స్తో కలిసి ట్రిప్కి వెళ్తున్నారా.. అయితే ఇవి మీకోసమే..

కొందరికి పెంపుడు జంతువులతో అటాచ్మెంట్ ఎక్కువ. ఫ్రీ టైమ్ దొరికితే చాలు వాటిని తమతో పాటు బయటికి తీసుకెళ్తుంటారు. కానీ, ఎక్కడికైనా టూర్ కి వెళ్లేటప్పుడు మాత్రం వాటిని ఇంటి దగ్గరే వదిలేస్తారు. కారణం పెట్స్ ని కొత్త ప్లేస్కి తీసుకెళ్లడం, జర్నీ టైమ్ లో వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఈజీ కాదు. అయితే, పెట్స్ ని వెంట తీసుకెళ్లేటప్పుడు సమస్య ఉండకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

పెంపుడు జంతువులతో ట్రిప్ కి వెళ్లాలి అనుకునేవాళ్లు వెటర్నరీ డాక్టర్ని కలసి, పెట్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలి. పెట్ హెల్దీగా ఉన్నాకూడా హెల్త్ సర్టిఫికెట్ కోసం ఎక్స్ ట్రా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రావెలింగ్ లో వాటికి ఇబ్బంది కలగొచ్చు అని డాక్టర్ చెప్తే, పెట్ని తీసుకెళ్లొద్దు. మీరు వచ్చేదాకా పెట్ని చూసుకునే బాధ్యతని ఇంట్లోవాళ్లకి అప్పగించాలి.. 

పెట్స్ కంఫర్ట్ కోసం..

జర్నీలో పెట్ కి కంఫర్ట్ ఉండాలి. అవి మీ ఒడిలో లేదా మెత్తని బ్యాగ్, పెట్ బెడ్... ఇలా అవి ఎక్కడ కంఫర్ట్ ఉంటాయో గమనించాలి. ఫ్లయిట్ లో వెళ్లేవాళ్లు ఆయా ఎయిర్లైన్స్ రెకమెండ్ చేసిన పెట్ క్యారియర్ మాత్రమే తీసుకెళ్లాలి. కొన్ని విమాన సంస్థలు చిన్నకుక్క పిల్లలు, పిల్లుల్ని మెత్తని బ్యాగ్, పెట్ క్రేట్
తీసుకెళ్లడానికి అనుమతిస్తాయి. 

కాలర్ ట్యాగ్ తప్పనిసరి..

పెట్స్ ని వెంట తీసుకెళ్లేటప్పుడు వాటికి కచ్చితంగా కాలర్ ట్యాగ్ ఉండాలి. ఎందుకంటే... కొత్త ప్లేస్ లో, జనంతో నిండిన స్ట్రీట్స్ ని చూసి భయపడి పెట్స్ తప్పిపోయే ఛాన్స్ ఉంది. అందుకని పెట్స్ కాలర్ ట్యాగ్ మీద వాటి పేరు, మీ ఫోన్ నెంబర్ రాయాలి. దాంతో అవి తప్పిపోయినా పట్టుకోవడం ఈజీ. మైక్రోచిప్ పెట్టినా కూడా వాటిని తొందరగా గుర్తించొచ్చు. 

పెట్ ఫ్రెండ్లీగా ఉంటేనే

అన్ని హోటల్స్, లాడ్జిల్లో పెట్స్ ని అనుమతించరు. ఒకవేళ అనుమతిస్తే...ఎక్స్ ట్రా ఛార్జ్ చేస్తారా? అన్నిరకాల పెట్స్ ని తీసుకురానిస్తారా? పెట్స్ ని గదిలో ఉంచి వెళ్లొచ్చా? ఇలా అన్ని విషయాలు ముందే తెలుసుకోవాలి.