173 రకాల వంటకాలతో అల్లుడికి విందు భోజనం

173 రకాల వంటకాలతో అల్లుడికి విందు భోజనం

గోదావరి జిల్లాల్లో మర్యాదలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటిది పండగకొచ్చిన కొత్త అల్లుడికి ఏ రేంజ్ లో మర్యాద చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతికి ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి ఏకంగా 173 రకాల వంటకాలతో అత్తామామలు విందు భోజనం వడ్డించారు. ఆ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వ్యాపారవేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతులు ఇటీవలే తమ కుమార్తె హారికను  పృధ్వీ గుప్తాకిచ్చి వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత వచ్చిన తొలి పండుగకు అత్తగారింటికి వచ్చిన అల్లుడికి ఇలా 173 వంటకాలతో మర్యాద చేశారు.