పెద్దపల్లి జిల్లాలోని అద్దె డబ్బులు చెల్లించలేదని కాలేజీ బిల్డింగ్‌‌‌‌కు తాళం

పెద్దపల్లి జిల్లాలోని  అద్దె డబ్బులు చెల్లించలేదని  కాలేజీ బిల్డింగ్‌‌‌‌కు తాళం

మంథని, వెలుగు:  అద్దె డబ్బులు చెల్లించడం లేదని గిరిజన గురుకుల(గర్ల్స్‌‌‌‌) కాలేజీ బిల్డింగ్‌‌‌‌కు ఓనర్‌‌‌‌‌‌‌‌ తాళం వేశాడు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గిరిజన ఆశ్రమ స్కూల్‌‌‌‌ ఏడేండ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. 

ఈ భవనానికి గత 8 నెలలుగా అద్దె డబ్బులు ఓనర్‌‌‌‌‌‌‌‌కు చెల్లించడం లేదు. దీంతో ఓనర్‌‌‌‌‌‌‌‌ సోమవారం బిల్డింగ్‌‌‌‌కు తాళం వేశాడు. దీంతో ఎగ్జామ్‌‌‌‌కు ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అవుతున్న తాము ఎక్కడ ఉండాలని స్టూడెంట్స్‌‌‌‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బిల్డింగ్‌‌‌‌కు అద్దె చెల్లించాలని లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గణేశ్‌‌‌‌ హెచ్చరించారు.