
ఆమనగల్లు, వెలుగు: కడ్తాల్ మండలం గోవిందాయపల్లిలో ఆదివారం గిరిజనులు ముత్యాలమ్మ బోనాలను ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ముత్యాలమ్మ ఫొటోను అలంకరించి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. అమ్మవారికి సారె సమర్పించారు. మహిళలు బోనాలతో భక్తి గీతాలు ఆలపిస్తూ మేళతాళాల మధ్య నృత్యాలు చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, దశరథ్ నాయక్, ఆనంద్, రాము నాయక్, లక్ష్మీనరసింహారెడ్డి, యాట నర్సింహ, సాయిలాల్, మంగ్యా నాయక్, శక్రు నాయక్, హీరాసింగ్, సికిందర్, సంతోష్, గణేశ్, రాంచందర్, లక్ష్మణ్, శ్రీను పాల్గొన్నారు.