ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు అమరులకు ఘన నివాళి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు అమరులకు ఘన నివాళి

వెలుగు ఫోటోగ్రాఫర్, నిజామాబాద్/కామారెడ్డి/ లింగంపేట/  : ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా పోలీస్​ అమరులకు ఘన నివాళులర్పించారు. అమరుల త్యాగాలు వెలకట్టలేమని నిజామాబాద్​ మల్టీ జోస్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ పి. సాయి చైతన్య అన్నారు. సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, అమరులైన పోలీసులను స్మరించుకోవడం బాధ్యత అని గుర్తు చేశారు. 

నిజామాబాద్ కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్టీ జోస్ ఐజీ, కలెక్టర్, సీపీ పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.  నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుంచి ఇప్పటివరకు 18 మంది పోలీసులు అసువులు బాశారన్నారు. 

 కామారెడ్డి జిల్లా పోలీస్​ ఆఫీస్​లో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పాల్గొని అమరులకు నివాళులర్పించారు. వారి త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో  ఎస్పీ రాజేశ్​చంద్ర, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి పాల్గొని నివాళి అర్పించారు.  లింగంపేట మండలంలో జరిగిన పోలీసులు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఎస్సైలు భార్గవ్​గౌడ్, దీపక్​గౌడ్​ అమరులకు నివాళులర్పించారు.