ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదాద్రి/హాలియా/తుంగతుర్తి, వెలుగు : తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడులో జరిగిన కార్యక్రమంలో విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరై శ్రీకాంతాచారి ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆయిల్‌‌‌‌‌‌‌‌ ఫెడ్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ పేలపూడి మధు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో, హాలియా, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో శ్రీకాంతాచారికి నివాళి అర్పించారు. నల్గొండలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, హాలియాలో కౌన్సిలర్ వర్ర వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కార్పెంటర్‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు బొడ్డుపల్లి వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి కాతోజు ఎల్లయ్యచారి, తుంగతుర్తిలో మండల తాటికొండ సీతయ్య, నాయకులు గుడిపాటి సైదులు, గుండగాని రాములు గౌడ్, ఎంపీటీసీ సృజన పరమేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

రిపేర్లకే నెలకు రూ. 60 వేలు

  • మిర్యాలగూడలో తరచూ మొరాయిస్తున్న మున్సిపల్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌
  • 14 నెలలకు రూ. 11.42 లక్షలు చెల్లించేందుకు నిర్ణయం

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని వెహికల్స్‌‌‌‌‌‌‌‌ రిపేర్లకే ప్రతి నెల భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. మున్సిపాలిటీలో 17 ట్రాక్టర్లు, 48 ఆటోలు, 2 డోజర్లు, రెండు వాటర్‌‌‌‌‌‌‌‌ ట్యాంకర్లు, ఒక జేసీబీ, బుల్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. వీటి ద్వారా పట్టణంలో చెత్తను సేకరించి రాంనగర్‌‌‌‌‌‌‌‌ బంధం సమీపంలోని డంపింగ్‌‌‌‌‌‌‌‌ యార్డుకు తరలిస్తుంటారు. ఈ వెహికల్స్‌‌‌‌‌‌‌‌కు పంక్చర్లు, మైనర్‌‌‌‌‌‌‌‌ రిపేర్లంటూ ప్రతి నెల రూ. 60 వేల నుంచి రూ. 70 వేల బిల్లులు పెడుతున్నారు. ఇందులో భాగంగా 2021 జూలై నుంచి 2022 ఆగస్టు వరకు 14 నెలలకు సంబంధించి రూ. 11.42 లక్షల బిల్లులు చెల్లించేందుకు పరిపాలన ఆమోదం కోసం కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ రవీంద్రసాగర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ గాజు ముక్కలు, ఇతర వస్తువుల కారణంగా వెహికల్స్‌‌‌‌‌‌‌‌ పంక్చర్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయి. చెత్తను తరలించే వాహనాలకు ఇన్‌‌‌‌‌‌‌‌టైంలో ఆయిల్‌‌‌‌‌‌‌‌ ఛేంజ్‌‌‌‌‌‌‌‌ చేయకపోవడంతో రిపేర్లకు గురవుతున్నాయి. రిపేర్లు ఖర్చును తగ్గించేలా చూసేందుకు ఒక మెకానిక్‌‌‌‌‌‌‌‌ను 
కేటాయించాలని మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌కు ప్రతిపాదన పంపించామని చెప్పారు.

ఓటరు నమోదును స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలి

సూర్యాపేట, వెలుగు : పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకునేందుకు అన్ని గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎలెక్ట్రోరల్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌ అబ్జర్వర్‌‌‌‌‌‌‌‌ బి. బాలమాయాదేవి ఆదేశించారు. సూర్యాపేట కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో శనివారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌.మోహన్‌‌‌‌‌‌‌‌రావుతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో స్వీప్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమాలను ఎక్కువగా చేపట్టాలని, ఓటరు నమోదును స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించారు. దివ్యాంగులు ఓటు నమోదు చేసుకునేలా సంక్షేమ శాఖ ద్వారా చర్యలు తీసుకోవాలి చెప్పారు. అనంతరం నూతనకల్‌‌‌‌‌‌‌‌ మండలం బిక్కుమల్ల, సూర్యాపేట పట్టణంలోని పోలింగ్‌‌‌‌‌‌‌‌ సెంటర్లను తనిఖీ చేశారు. రివ్యూలో ఆర్డీవోలు రాజేంద్రకుమార్, కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, వెంకారెడ్డి, ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ విభాగం పర్యవేక్షకులు పద్మారావు, డీటీ వేణు పాల్గొన్నారు.

కేంద్ర పథకాలెందుకు అమలు చేయరు ?

సూర్యాపేట, వెలుగు : టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే పథకాలను ప్రవేశపెడుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు విమర్శించారు. సూర్యాపేట పట్టణంలో 31, 32 వార్డులకు చెందిన పలువురు శనివారం బీజేపీలో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలో ప్రభుత్వ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయన్నారు. సూర్యాపేట మినీ ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. విద్య, వైద్య రంగాలకు కేంద్రం నిధులిస్తోంటే... ఆ డబ్బులు తామే ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆవాస యోజన, ఫసల్‌‌‌‌‌‌‌‌ బీమా యోజన, ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌ పథకాలను ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్ల అవినీతి, ఆక్రమణలతో సామాన్య ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో సంతోష్‌కుమార్‌‌‌‌‌‌‌‌, బుద్దా శ్రవణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ గుప్తా, చల్లా విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, బుద్దా శ్రీనివాస్, సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కర్నాటి కిషన్, పట్టణ అధ్యక్షుడు హబిద్ పాల్గొన్నారు.

తాజ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో దళితబంధు యూనిట్ల పంపిణీ

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో నలుగురికి మంజూరైన దళితబంధు యూనిట్లను శనివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అందజేశారు. అనంతరం అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, గ్రామ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృ-షి చేస్తామని హామీ ఇచ్చారు. విగ్రహావిష్కరణ, వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ ప్రారంభానికి మంత్రి ఎర్రబెల్లి వస్తానని హామీ ఇచ్చారని, చివరి నిమిషంలో అనుకోని 
కార్యక్రమాల వల్ల రాలేకపోయారన్నారు. 

ఎమ్మెల్సీని పట్టించుకోని ఎమ్మెల్యే శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి

తాజ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి రావడం ఆలస్యం కావడంతో ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి సుమారు గంటపాటు కార్డులోనే కూర్చొని వెయిట్‌‌‌‌‌‌‌‌ చేశారు. తర్వాత ఎమ్మెల్యే వచ్చీరావడంతో కృష్ణారెడ్డిని పట్టించుకోకుండా నేరుగా ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం పార్టీ లీడర్లు ఎమ్మెల్యేకు విషయం చెప్పడంతో కృష్ణారెడ్డితో కలిసి ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

రాజకీయాలకతీతంగా అభివృద్ధి

నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : రాష్ట్రంలో రాజకీయాలకతీతంగా అభివృద్ధి జరుగుతోందని నకిరేకల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. నల్గొండ జిల్లా  చిట్యాల మండలం ఏపూర్, గుండ్రాంపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి  వచ్చాక గ్రామాలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీపీ కొలను సునీత వెంకటేశం గౌడ్, సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు పాలెం మాధవి, పుష్పమ్మ, మార్కెట్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ జడల ఆదిమల్లయ్య, జడ్పీటీసీ ధనమ్మ, ఐలయ్య పాల్గొన్నారు.

బీజేపీని బూత్‌‌‌‌‌‌‌‌ స్థాయి నుంచి పటిష్టం చేయాలి

కోదాడ/హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : బీజేపీని బూత్‌‌‌‌‌‌‌‌ స్థాయి నుంచి పటిష్టం చేయాలని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి చాడ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో శనివారం జరిగిన బూత్‌‌‌‌‌‌‌‌ స్థాయి శక్తి కేంద్రాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జుల మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. బూత్‌‌‌‌‌‌‌‌ స్థాయిలో పార్టీని పటిష్టం చేస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఈజీ అవుతుందన్నారు. బూత్‌‌‌‌‌‌‌‌ కమిటీలను ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పగించాలని మండల కమిటీ అధ్యక్షులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేలా ప్రచారం చేయాలని చెప్పారు. కోదాడలో జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి, ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్‌‌‌‌‌‌‌‌, నియోజకవర్గ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ కనగాల నారాయణ, నాయకులు వెంకట్రామయ్య, నూనె సులోచన, బొలిషెట్టి కృష్ణయ్య, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో గట్టు శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కొణతం లచ్చిరెడ్డి, బాల్సన్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, వేముల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, తోట శేషు, అంబళ్ల నరేశ్‌‌‌‌‌‌‌‌, ముస్కుల చంద్రారెడ్డి పాల్గొన్నారు.