అసోంలో బీజేపీని భూ స్థాపితం చేస్తాం

అసోంలో బీజేపీని భూ స్థాపితం చేస్తాం

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అభిషేక్ బెనర్జీ

గువాహటి : బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో పడిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో టీఎంసీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా అసోం రాజధాని గువాహటిలో పార్టీ కార్యాలయాన్ని బుధవారం (ఈనెల 11న) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు. హిందువులు ప్రమాదంలో ఉన్నారని కొందరు అంటున్నారని, ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని మరికొందరు అంటున్నారని అన్నారు. ‘మీ మతం కళ్లద్దాలు తీసి చూడండి..భారతదేశం ప్రమాదంలో ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అసోంలోని 14 లోక్‌సభ స్థానాలకు గాను 10 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 

అసోం నుంచి బీజేపీని తరిమికొట్టడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ అన్ని ప్రయత్నాలు చేస్తుందని అభిషేక్ బెనర్జీ అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపుర, మేఘాలయా రెండింటిలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోనే ప్రాంతీయ, జాతీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అభిషేక్ బెనర్జీ సమక్షంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయడంపై టీఎంసీ అధినాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రిపున్ బోరాను అసోం టీఎంసీ అధ్యక్షుడిగా నియమించింది. ఆయన ఇలీవలే కాంగ్రెస్‌ పార్టీని వీడి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు. 

మరిన్ని వార్తల కోసం..

మద్యం మత్తులో బూతులు తిడుతూ.. సెక్రటరీని కొట్టిన టీఆర్ఎస్ లీడర్

తాజ్ మహల్ స్థలం మాదే.. ఆధారాలున్నాయి