త్రిప్తి డిమ్రీ బ్యాడ్ న్యూస్‌‌‌‌‌‌‌‌ చిత్రం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

త్రిప్తి డిమ్రీ బ్యాడ్ న్యూస్‌‌‌‌‌‌‌‌ చిత్రం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

‘యానిమల్‌‌‌‌‌‌‌‌’ సినిమాతో నేషనల్ క్రష్‌‌‌‌‌‌‌‌గా మారిన త్రిప్తి డిమ్రీ. ఈ సినిమా తర్వాత యూత్‌‌‌‌‌‌‌‌తో ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పటివరకూ ఆమె సినిమాలను పట్టించుకోని ప్రేక్షకులు.. ఇప్పుడు ఆమె నుంచి ఏ సినిమా వస్తుందా అని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో విక్కీ కౌశల్‌‌‌‌‌‌‌‌కు జంటగా ఆమె నటించిన ‘బ్యాడ్ న్యూస్‌‌‌‌‌‌‌‌’ చిత్రం రిలీజ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతోంది.  తాజాగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేశారు.  అమ్మి విరాక్ ఇందులో మరో హీరోగా నటించాడు.  

ఇద్దరు హీరోలతోనూ ఫిజికల్ రిలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అని పెటర్నిటీ  పరీక్షలు చేయిస్తే.. ఆ ఇద్దరూ అని తేలుతుంది. ఆ తర్వాత ఆమె ఎవరితో రిలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉంది.. వారసుడి విషయంలో ఆ ఇద్దరి పరిస్థితి ఏమిటి అనేది అసలు కథ. పుట్టబోయే బిడ్డ విషయంలో ఇద్దరు తండ్రులు పోటీపడటం హిలేరియస్‌‌‌‌‌‌‌‌గా ఉంది.  ఎమోషనల్ కంటెంట్ అయినప్పటికీ దర్శకుడు ఆనంద్ తివారీ పూర్తిస్థాయి ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా తెరకెక్కించారు. కరణ్ జోహార్,  అపూర్వ మెహతా, ఆనంద్ తివారీ నిర్మిస్తున్నారు. జులై 19న సినిమా విడుదల కానుంది.