అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు.. సీఎం సారు మాకు న్యాయం చేయండి

అక్రమ కేసులు పెట్టి  మమ్మల్ని వేధిస్తున్నారు.. సీఎం సారు మాకు న్యాయం చేయండి

కుత్బుల్లాపూర్: బౌరంపేట్లో వ్యవసాయ భూమిని అమ్మనందుకు కిరాయి గుండాలతో తమపై దాడికి యత్నిస్తున్నారని రెండు రోజుల క్రితం దుండిగల్ పోలీస్ స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. అయితే తమ పైనే కేసులు పెడతారా అని  త్రిపుర భవన నిర్మాణ సంస్థతో పాటు కొందరు బీఆర్ఎస్  నాయకులు తమపై  అక్రమ కేసులు పెట్టి తమను వేధిస్తున్నారని  అవేదన వ్యక్తం చేశారు రైతులు. 

ఇవాళ  బౌరంపేట్ లోని  వ్యవసాయ భూమిలో  మీడియా సమావేశంలో తమ గోడును విన్నవించుకున్నారు రైతులు. త్రిపుర భవన నిర్మాణ సంస్థతో పాటు కొందరు బీఆర్ఎస్ నాయకులు  తమను  ఏడేళ్ళుగా వేధిస్తున్నారని కోర్టు కార్యాలయాల చుట్టు తిరిగి తమ భూమిలోకి ఎవరు రావొద్దని ఆర్థర్ తెచ్చుకున్నా..వాటిని పట్టించుకోకుండా హింసిస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు బాధిత రైతులు. సీఎం రేవంత్ రెడ్డి  జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు బౌరంపేట్ రైతులు . త్రిపుర భవన నిర్మాణ సంస్థతో కలిసి  మేకల వెంకటేష్, పసుపులేటి సుధాకర్ అనే  బీఅర్ఎస్ నాయకులు  తమపై ఒత్తిడి తెస్తున్నారని..  తమకు రక్షణ కల్పించాలని కోరారు.

కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బౌరం పేట్ లో   కృష్ణారెడ్డి, కంసమ్మా  అనే రైతులకు  సర్వే నం.188,187,189లో  2ఎకరాల 32 గుంటల  స్థలం ఉంది. ఈ స్థలం విషయంలో త్రిపుర భవన నిర్మాణ సంస్థకు , రైతులకు మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. ఈ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఇటీవల రైతులకు మద్దతుగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ను కూడా బేఖాతరు చేయకుండా త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థకు చెందిన కొందరు దౌర్జన్యంగా కంసమ్మ భూమిలో ప్రవేశించి హద్దులు చెరిపారని ఆరోపించారు రైతులు . పలుకుబడి ఉపయోగించి తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, భూమిని అమ్మక పోతే చంపుతామని రోజు ఇంటికి వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు రైతులు.