వట్టెం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ 

వట్టెం వెంకటేశ్వర స్వామిని  దర్శించుకున్న త్రిపుర గవర్నర్ 

కందనూలు, వెలుగు: వట్టెం వేంకటేశ్వర స్వామిని  త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేన రెడ్డి దర్శించుకున్నారు.  ఆలయ నిర్వాహకులు ఆయనకు  స్వాగతం పలికి,  ప్రత్యేక పూజలు చేశారు.

బిజినేపల్లి లో వెంకటేశ్వర స్వామి  వార్షికోత్సవ బ్రోచర్ ను విడుదల చేశారు.  ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అనంత నరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ రాములు, బంగారు శృతి, ప్రతాప్ రెడ్డి, వెంకట్ రెడ్డి, భాస్కరాచారి పాల్గొన్నారు.