కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై నాలుగేళ్లు అయినా ఇప్పటికీ అదే స్టార్ డమ్ కొనసాగిస్తూ వరుస సినిమాలతో మెప్పిస్తోంది త్రిష. సోమవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల నుంచి స్పెషల్ పోస్టర్స్‌తో బర్త్‌డే విషెస్ తెలియజేశారు మేకర్స్. ఆమె చిరంజీవికి జంటగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం నుంచి స్టన్నింగ్ లుక్‌ను రిలీజ్ చేశారు.
ట్రెడిషినల్ డ్రెస్‌లో హారతి పళ్లెం పట్టుకుని ఉన్న పోస్టర్ బ్యూటిఫుల్‌గా ఉంది. ఇందులో తను అవని పాత్రలో కనిపించనుంది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
మరోవైపు సూర్యకు జోడీగా త్రిష నటించిన ‘కరుప్పు’ చిత్రం నుంచి కూడా స్పెషల్ పోస్టర్‌తో ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేసింది టీమ్. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. మే 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
బెస్ట్ బర్త్ డే ట్రీట్
ఇక తన పుట్టినరోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న త్రిష.. నేరుగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన విజయ్ ఇంటికి వెళ్లింది. విజయ్ సీఎం కావాలనే ఇప్పటికే పలు సందర్భాల్లో ఆమె వెల్లడించింది.
అయితే ఆమె పుట్టినరోజునే విజయ్‌కు గ్రాండ్ మెజారిటీ రావడం, సీఎం కానుండడంతో సోమవారం సోషల్ మీడియా వేదికగా త్రిష పేరు మారుమోగింది. త్వరలోనే త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందని, టీవీకే పార్టీలో ఆమె కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
