కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తున్న త్రిష

కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తున్న త్రిష

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్నా త్రిష అందంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. గతేడాది ఆమె నటించిన 'పొ న్నియన్ సెల్వన్' తమిళనాట భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమా ఫంక్షన్లో త్రిష లుక్స్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. తాజాగా ఈ ప్రమోషన్స్ హీరో యిన్లు ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ కూడా పాల్గొన్నారు. 

కానీ, అందరి చూపులు ఈ సోగ కళ్ల సోయగంపైనే ఉన్నాయి. తన గ్లామర్తో చూ పుతిప్పుకోనివ్వ కుండా చేస్తోన్న ఈ బ్యూటీ కుర్ర హీరోయిన్లకు సైతం పోటీగా నిలుస్తోంది. త్రిషను చూస్తే నిజంగానే ఈమెకు 30 ఏళ్లు దాటిందా? అని ఆశ్చ ర్యపోతున్నారు ఫ్యాన్స్. మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న పొన్నయన్ సెల్వన్ -2 ఏప్రిల్ 28న విడుదల కానుంది.