- టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్..
నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో 2028 ఎన్నికల్లో రాబోయేది బీసీ ప్రభుత్వమేనని టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. గురువారం నల్గొండలోని ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ సమాజం కోసం పోరాడే నాయకుడు తెలంగాణ రాజ్యధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. రాజ్యాంగంలో రిజర్వేషన్ కి సంబంధించి 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదని ఎక్కడ రాసింది లేదన్నారు.
50 శాతం సీలింగ్ అనేది కేవలం సుప్రీంకోర్టు నిర్ణయించి అమల్లోకి తీసుకువచ్చిన నిబంధన మాత్రమే అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని బీసీలను మభ్యపెడుతూ మోసం చేస్తోందన్నారు.
లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కేవలం 17 శాతం రిజర్వేషన్ పరిమితం చేసి బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారన్న అంశం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఈ ప్రోగ్రాంలో సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మేడబోయిన సాయిలు, వరుణ్ కుమార్, కె. వినోద్ చారి, పి. నాగార్జున. టీఆర్పీ కార్యకర్తలు వట్టే లింగరాజు, బూర కిరణ్, మామిడి ఉదయ్, ఏర్పుల రాజు, గుగులోతు సుమన్ తదితరులు పాల్గొన్నారు.
