వివేక్ వెంకటస్వామి సమక్షంలో భారీగా చేరికలు

వివేక్ వెంకటస్వామి సమక్షంలో భారీగా చేరికలు

నల్లగొండ : మునుగోడులో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు.

చండూర్ మండలం జోగిగూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వివేక్ వెంకటస్వామి సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని వివేక్ వెంకటస్వామి కోరారు.