ఈసీకి మార్పుచేసిన కారు సింబల్ అందజేసిన టీఆర్ఎస్

ఈసీకి మార్పుచేసిన కారు సింబల్ అందజేసిన టీఆర్ఎస్

సీఎం కేసీఆర్ చేసిన ఫిర్యాదుపై పై స్పందించింది కేంద్ర ఎన్నికల సంఘం. గత డిసెంబరు 27న కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిసి కారు గుర్తును పోలిన సింబల్స్ ను ఎవరికీ కేటాయించవద్దనీ… కారు గుర్తును బోల్డ్ చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు కేసీఆర్. సీఎం కేసీఆర్ పిర్యాదుపై స్పందిస్తూ… కారు గుర్తు బోల్డ్ (గుర్తు రంగు కనిపించేలా మార్పు) చేయడంపై సూచనలు కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. మార్పు చేసిన కారు గుర్తు సింబల్ ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్.

దీనిపై ఢిల్లీలో స్పందించిన వినోద్ “బ్యాలెట్ లో కారు రంగు సరిగా కనిపించక పోవడం వల్ల వృద్దులు, కంటి సమస్య ఉన్న వారు కారు గుర్తును పోల్చుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఐనా కూడా ఓపికగా కారు గుర్తుకు ఓటు వేసి, ఓటర్లు భారీ మెజార్టీని టీఆర్ఎస్ కు అందించారు. కొందరికి కేటాయించిన ట్రక్కు గుర్తు…. కారు గుర్తును పోలి ఉండడం వల్ల పలు నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓట్లు తగ్గాయి. ఇలాంటివాటికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం లేకుండా చూడాలని కోరాం” అన్నారు.