కేసీఆర్ ను విమర్శించే హక్కు బండి సంజయ్ కు లేదు

కేసీఆర్ ను విమర్శించే హక్కు బండి సంజయ్ కు లేదు

ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు లేదని జనగాం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న కోటకు ఎన్ని కోట్ల నిధులు ఇస్తానని హామీ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జన సమీకరణ చేయలేకనే జనగాం చౌరస్తాలో బండి సంజయ్ మీటింగ్ పెట్టారంటూ సెటైర్ వేశారు. కేంద్రం నుంచి రూ.400 కోట్ల నిధులు తీసుకొచ్చి.. ఖిలాషాపూర్ కోటను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. 

బీజేపీ ఫ్లెక్సీలను ఆ పార్టీ నాయకులే చించివేసి, తమ పార్టీ నాయకులపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ర్టం కోసం సీఎం కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి వచ్చారని, బీజేపీ నాయకులు ఏం దీక్షలు చేశారో..? ఎవరు ప్రాణ త్యాగం చేశారో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి, రాష్ర్టానికి మాత్రం ఎందుకు మొండిచేయి చూపించిందో చెప్పాలని కోరారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే బండి సంజయ్ జనగాం నుంచి వెళ్లిపోయారని మండిపడ్డారు.