
మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ప్రమాదం తప్పింది. అక్కన్నపేట రైల్వే గేట్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసమైంది. మెదక్ పర్యటన అనంతరం రామాయంపేటలో జరిగే పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.