నూతన విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించుకోవాలి

నూతన విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండతో రజకులు, నాయి బ్రాహ్మణులు ఇపుడుపుడే నిలదోక్కుకుంటున్నారన్నారు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య. రాష్ట్ర ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యుత్ సంస్కరణల వల్ల రజకులు, నాయి బ్రాహ్మణులూ తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నూతన సంస్కారణల వల్ల సబ్సిడీ పై విద్యుత్ అందించే వీలు ఉండదన్నారు. ప్రైవేట్ డిస్కెమ్ లు ప్రవేశపెట్టడం వల్ల చార్జీలు విపరీతంగా పెరుగుతాయన్నారు. 

కేంద్ర ప్రభుత్వ వైఖరి కుల వృత్తులను అనణదొక్కే విదంగా ఉందన్నారు. బీసీల పొట్ట కొట్టి, కార్పొరేట్ వాళ్లకు కొమ్ము కాయడమే బీజేపీ  విధానమన్నారు. బీసీ కుల గణన అడుగుతున్నా చేయడం లేదన్నారు. వెంటనే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు సారయ్య. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని.. అయిన కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. బీసీ ప్రధాని అయి ఉండి, బీసీ కుల వృత్తులకు అన్యాయం చేయడం బాధాకరమన్నారు. 

ఇవి కూడా చదవండి: 

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే.. తెలంగాణ ఏర్పాటు