కేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనేలా చేస్తాం

కేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనేలా చేస్తాం

హైదరాబాద్: కేంద్రం మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనేలా చేస్తామన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. యాసంగి  వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్ చెరు బస్టాండ్ దగ్గర ముంబయి జాతీయ రహదారిపై టీఆర్ఎస్ రాస్తారోకో నిర్వహించింది. ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుందన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ నెల 11న ఢిల్లీలో చేసే దీక్షతో తెలంగాణ సత్తా చూపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ అంబేద్కర్  విగ్రహానికి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. తర్వాత ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు టీఆర్ఎస్ నేతలు.

టీఆర్ఎస్ జాతీయ రహదారుల దిగ్భందం సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. ఉదయం నుంచి జాతీయ రహదారులపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. దీంతో రోడ్లపై కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దగ్గర టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, ఫైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆందోళనల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆందోళనలతో వివిధ పనుల కోసం వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసలే ఎండాకాలం కావడంతో గంటల కొద్దీ వాహనాల్లో రోడ్లపై ఆగిపోవడంతో అల్లాడిపోయారు. బస్సులు , కార్లలో ఉన్న చంటి పిల్లలు ఎండ వేడికి తట్టుకోలేక గుక్కపట్టి ఏడ్చారు. చాలా చోట్ల అంబులెన్స్ లు రోడ్లపైనే ఆగిపోయాయి. కొద్ది మంది ఎండలో రోడ్ల మీద ఉండలేక... నడుచుకుంటూనే వెళ్లారు. ధర్నాల పేరుతో సామాన్య ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సూర్యాపేట జిల్లా కోదాడలో టీఆర్ఎస్ నేతలు రైతు దీక్ష చేపట్టారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసనకు దిగారు. రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర ధర్నా చేశారు. నిరసనలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో పాటు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు.  

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ సంగారెడ్డిలో టీఆర్ఎస్ నేతలు ధర్నాకు చేపట్టారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు, ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు నిరసనకు దిగారు. ముంబాయి రహదారిని బ్లాక్ చేశారు. దీంతో ట్రాఫిక్ ఆగిపోయింది. కేంద్రం వడ్లు కొనకుంటూ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.

 

ఇవి కూడా చదవండి

మాకు రాజకీయాలు తెలియదు.. అవినీతి అంతం చేయడమే తెలుసు

వీడియో: సాయం కోసం మెట్రో మాల్ ముందు క్యూలైన్లు

కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా ? 

షాంఘైలో కరోనా కలకలం.. లాక్డౌన్ పెట్టినా తగ్గని కేసులు

ఆడపిల్ల పుట్టిందని సంబురాలు.. హెలికాప్టర్లో ఇంటికి