దుబ్బాకలో టీఆర్ఎస్ దే విజయం: సీఎం కేసీఆర్

దుబ్బాకలో టీఆర్ఎస్ దే విజయం: సీఎం కేసీఆర్

దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఎవరికి వారే తమదే  గెలుపంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు నియోజక వర్గంలో భారీ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే దుబ్బాక ఉపఎన్నికలపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ జిల్లాలో ఇవాళ(గురువారం) కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభించారు. ఆ తర్వాత మీడియాతో ఆయన కాసేపు చిట్ చాట్ నిర్వహించారు. దుబ్బాక ఎన్నికలు తమకు ఒక లెక్కే కాదన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో TRS అభ్య‌ర్ధి సుజాత విజ‌యం ఎప్పుడో ఖాయ‌మైంద‌న్నారు. ఎన్నికల సమయంలో చిల్లర తతంగాలు నడుస్తూనే ఉంటాయని… అలాంటి వాటిని తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు. అంతేకాదు విపక్షాలు చేస్తున్న రాద్దాంతాన్ని ఓటర్లు నమ్మే స్థితిలో లేరని అన్నారు సీఎం కేసీఆర్.