
- సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డికి టీఆర్టీఎఫ్ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఈడీ పూర్తిచేసిన ఎస్జీటీలకు ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్ హెచ్ఎం)గా ప్రమోషన్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ కోరారు. శుక్రవారం ఆయన సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డిని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు ప్రణీద్ కుమార్ తో పాటు కలిసి వినతిపత్రం అందించారు. పీఎస్ హెచ్ఎం పోస్టులు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్న ఉత్తర్వులే ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. అవసరమైతే ఆరు నెలల బ్రిడ్జి కోర్సును పూర్తి చేసుకునే వెసులుబాటును పరిశీలించి, బీఈడీ, ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. దీనికి అవసరమైన నిబంధనలు మార్చాలని విజ్ఞప్తి చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో పండిట్, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు.