ఘోర రోడ్డు ప్రమాదం ..  ఒకే కుటుంబంలో 10 మంది మృతి 

ఘోర రోడ్డు ప్రమాదం ..  ఒకే కుటుంబంలో 10 మంది మృతి 

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ధామ్‌తరి జిల్లాలో మే 03 బుధవారం సాయంత్రం ట్రక్కును, బొలెరో  వాహనం  ఢీకొనడంతో 10 మంది అక్కడికక్కడే చనిపోగా, పలువురు గాయపడ్డారు.  అయితే వీరంతా  ఒక కుటుంబానికి చెందినవారు . రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను  మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు.  జగత్రా సమీపంలోని కంకేర్ జాతీయ రహదారిపై ఢీకొంది. మృతులంతా  సొరం నుండి మర్కటోలాకు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

https://twitter.com/ANI_MP_CG_RJ/status/1653847001904336896  

ప్రమాదం జరిగిన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.  ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర సీఎం  భూపేష్ బఘెల్ ప్రాణనష్టంపై సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పురూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.  .

బీహార్‌లో కూడా ఇదే తరహా ప్రమాదం

బీహార్‌లో కూడా ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. సీతామూర్తి జిల్లాలో ఆటోలో పెళ్లికి వెళ్లి వస్తు్ండగా ట్రక్కుఢీకొనడంతో చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. మృతి చెందిన వారిలోఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు.  గాయపడిన వారిని సీతామర్హిలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.