ట్రూ కాలర్‫లో ఏఐ ఫీచర్ ఆటోమ్యాటిక్ బ్లాక్ స్పామ్ కాల్స్ ఇలా సెట్ చేసుకోండి

ట్రూ కాలర్‫లో ఏఐ ఫీచర్ ఆటోమ్యాటిక్ బ్లాక్ స్పామ్ కాల్స్ ఇలా సెట్ చేసుకోండి

ట్రూ కాలర్ యాప్ చాలామంది వారి ఫోన్స్ లో వాడుతూనే ఉంటారు. ట్రూ కాలర్ యాప్లో  కొత్త ఏఐ టెక్నాలజీ బేసిడ్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో ఆటోమ్యాటిక్లీ స్పామ్ కాల్స్ బ్లాక్ అవుతాయి. ఇది స్పామ్ కాల్స్  నుంచి మొబైల్ యూజర్స్ కు  భద్రత కల్పిస్తుంది. ఈ ఫీచర్ మాక్స్ అనే స్పామ్ ప్రొటెక్షన్ ఆప్షన్ తాజాగా తీసుకొచ్చింది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్స్‪కు మాత్రమే అందుబాటులో ఉంది. 

ఇది ఫేక్ కాల్స్ గుర్తించడానికి, ఎక్కువ మంది రిపోర్ట్ కొట్టిన, స్పామ్ చేసిన నెంబర్లను ఆటోమ్యాటిక్‭గా బ్లాక్ చేసి, మనకు కాల్ రాకుండా చేస్తుంది. ఆ సర్వీస్ ప్రీమియం.. సబ్‫స్ర్కీప్షన్‪ తీసుకున్న వారికే మ్యాక్స్ ఫీచర్ పని చేస్తుంది. నెలకు రూ.75, సంవత్సరానికైతే రూ.529లు చెల్లించాలి. ఇది ఎలా సెట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం..

ట్రూకాలర్ యాప్ ఓపెన్ చేసి, సెట్టింగ్ ఆప్షన్ కు వెళ్లండి. అక్కడ బ్లాక్ అనే నావిగేషన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీకు ఆఫ్, బెసిక్, మ్యాక్స్ మూడు మోడ్స్ అక్కడ ఉంటాయి. డీఫాల్ట్‪గా అది ఆఫ్‪లో ఉంటుంది. దాన్ని మీరు మ్యాక్స్‪లో పెట్టుకోవాలి.