
అమెరికాలో నేషనల్ ఎమెర్జెన్సీని ప్రకటించారు ఆ దేశ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్. అయితే విదేశీ శత్రువుల నుండి దేశంలోని కంప్యూటర్ నెట్ వర్క్‌కు ముప్పు ఉండటంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఆదేశాల్లో ఏ కంపెనీ పేరును ప్రస్తావించలేదు. చైనాకు చెందిన హువావేని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జాతీయ భద్రత కోసం అమెరికా కంపెనీలు విదేశీ టెలీకాం సేవలను వినియోగించకుండా అడ్డుకట్ట పడింది. ఇటీవల అమెరికా, దాని మిత్రదేశాలు హువాయి.. చైనా కోసం గూఢచర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు అమెరికా హువావే 5జీ నెట్‌వర్క్‌ను వినియోగించ వద్దని మిత్రదేశాలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. ట్రంప్ చర్యను ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఛైర్మన్ అజిత్ పై స్వాగతించారు. అమెరికా నెట్‌వర్క్‌ను కాపాడుకోవడానికి ఇది సరైన చర్య అని అన్నారు.