
ఏపీలోని అనంతపురంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఓ మహిళ దాడికి దిగింది. తాను ఆపమన్న చోట బస్సు ఆపనందుకు బస్సు డ్రైవర్ పై ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ.. బైకులో బస్సును ఓవర్ టేక్ చేసి మరీ.. బస్సును ఆపి డ్రైవర్ పై దాడికి దిగింది. సోమవారం ( ఆగస్టు 11 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా నడిమివంకకు చెందిన సుచరిత ఓ ప్రైవేట్ ఉద్యోగి. నడిమివంక వద్ద బస్సు ఎక్కడం కోసం అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న పల్లె వెలుగు బస్సును ఆపింది సుచరిత.
బస్సు డ్రైవర్ నడిమివంక దగ్గర బస్సును ఆపకుండా వెళ్ళాడు. దీంతో డ్రైవర్ పై ఆగ్రహంతో ఊగిపోయిన సుచరిత బైకులో బస్సును ఓవర్ టేక్ చేసి వెళ్లి మరీ.. బస్సును ఆపి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగి అతనిపై దాడికి దిగింది. తోటి ప్రయాణికులు వారిస్తున్నా కూడా వినకుండా డ్రైవర్ పై దాడికి దిగింది సుచరిత.
ఏపీలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై మహిళ దాడి... బైకులో బస్సును ఓవర్ టేక్ చేసి మరీ.. pic.twitter.com/3gctnKQrI3
— Manohar Reddy (@ManoharRed18542) August 12, 2025
మహిళ దాడితో షాక్ కి గురైన బస్సు డ్రైవర్ పోలీసులను ఆశ్రయించారు. డ్రైవర్ ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పట్ల కనీస గౌరవం కూడా లేని ఇలాంటి మహిళల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు పధకం అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.