అమెరికాలో కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార వేడుక మరికాసేపట్లో జరగనుంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్ హౌజ్ ను వదిలివెళ్లారు. ఫ్లోరిడాలోని తన ఫామ్ హౌజ్ కు ట్రంప్ వెళ్లారు. వాషింగ్టన్ లో కొద్దిసేపటికింద.. ట్రంప్ అధికారులకు, సిబ్బంది ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. ఉద్యోగ కల్పనలో తామే బెస్ట్ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 9 నెలల్లో వ్యాక్సిన్ డెవలప్ చేశామన్నారు. ప్రజలు తనను గుర్తు పెట్టుకుంటారనీ..ఎన్నడూ లేనంత గొప్ప సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. వేరే ఫామ్ లో మళ్లీ మీ ముందుకు వస్తానన్న ట్రంప్… ఫేర్వెల్ స్పీచ్ సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు. కొత్త అడ్మినిస్ట్రేషన్ కు ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు.స్పెషల్ ఫ్లైట్ లో… ఫ్లోరిడాలని తన ఫామ్ హౌజ్ కు వెళ్లారు ట్రంప్.
బైడన్ ప్రమాణ స్వీకారానికి ముందే ట్రంప్ వైట్‌హౌస్ ఖాళీ చేయడం గమనార్హం. రాత్రి 10.30 గంటలకు అమెరికా కొత్త అధ్యక్షుడిగా బైడన్ ప్రమాణం జరగనుంది. బైడన్ ప్రమాణానికి కూడా హాజరుకాకూడదని ట్రంప్ నిర్ణయించుకున్నారు. సంక్షుభిత రాజకీయ పరిణామాల మధ్య అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ ఉరఫ్ జో బైడెన్ (78) బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని తుదిదాకా అంగీకరించకుండా, ఆఖరికి దేశ ప్రజాస్వామ్యసౌధంపైనే దాడికి అనుచరులను పురిగొల్పి- రెండుసార్లు అభిశంసనను మూటగట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ స్థానే బైడెన్ ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. అదే కేపిటల్ హిల్ భవన మెట్లపై ఏర్పాటు చేసిన వేదిక నుంచి ఆయన పదవీ ప్రమాణం చేస్తారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ఆయన కంటే ముందుగానే ప్రమాణం చేస్తారు. భారతీయ మూలాలున్న కమల ఇక మీదట శ్వేతసౌధంలో అత్యంత కీలకపాత్ర పోషించనున్నారు. ఓ రకంగా ఆమే అన్ని వ్యవహారాల్లో కేంద్ర బిందువు అవుతారు.
