డొనాల్డ్ ట్రంప్ కాళ్లలో వాపు.. టెస్టులు చేస్తే.. క్రానిక్ వీనస్ ఇన్ సఫీషియన్సీ తేలింది

డొనాల్డ్ ట్రంప్ కాళ్లలో వాపు.. టెస్టులు చేస్తే.. క్రానిక్ వీనస్ ఇన్ సఫీషియన్సీ తేలింది
  • ట్రంప్‌‌కు సీవీఐ వ్యాధి నిర్ధారణ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(78) అనారోగ్యానికి గురయ్యారు. ఆయన క్రానిక్ వీనస్ ఇన్ సఫీషియన్సీ (సీవీఐ) అనే దీర్ఘకాలిక సిరల వ్యాధి(కాళ్ల వాపు)తో బాధపడుతున్నట్లు వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించింది. 

ఈ వ్యాధి 70 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో కాళ్ల నుంచి గుండెకు రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో రక్తం మొత్తం కాళ్లలోనే పేరుకుపోతుంది. ఫలితంగా కాళ్లలో వాపు ఏర్పడుతుంది. 

ఇటీవల ట్రంప్ కాళ్లలోనూ ఇలా వాపు కనిపించడంతో టెస్టులు చేసినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. టెస్టుల అనంతరం ట్రంప్ సీవీఐతో బాధపడుతున్నట్లు తేలిందని వెల్లడించారు. 

ఈ వ్యాధి ప్రమాదకరం కాదని, ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ట్రంప్ తన విధులను ఎప్పటిలాగే నిర్వహిస్తున్నారని.. ఈ వ్యాధి ఆయన రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.