ట్రంప్ కు ఆ పవర్ లేదు

ట్రంప్ కు ఆ పవర్ లేదు

ప్రెసిడెంట్ ఎలక్షన్ డేట్ మార్చలేం
ఆ పవర్ ట్రంప్ కు లేదంటున్న ఎక్స్ పర్ట్స్
రాజ్యాంగ సవరణ అవసరమని వెల్లడి

వాషింగ్టన్: కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ గురువారం చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. వోటింగ్ సక్రమంగా, సేఫ్ గా జరిగేందుకు ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాలని ఆయన పేర్కొన్నారు. అయితే ఇది అమెరికా చట్టాలకు విరుద్ధమని యూఎస్ హిస్టారియన్ మైఖేల్ బెస్ క్లోజ్ అంటున్నా రు. అమెరికన్ కాంగ్రెస్ అనుమతిస్తే తప్ప ఈ విషయంలో ట్రంప్ కు ఎలాంటి అథారిటీ లేదన్నారు. అయితే ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల ఆధిపత్యమే ఉన్నందున ట్రంప్, ఆయన రిపబ్లి కన్ పార్టీ సభ్యులు ఎన్నికలను వాయిదా వేయాలనుకున్నా.. అయ్యే పని కాదన్నారు.

ఆ తేదీ ఫిక్స్.. అంతే
కరోనా నేపథ్యంలో ప్రజల భద్రత కోసం బ్యాలట్ వోటింగ్ కాకుండా మెయిల్ ఇన్ వోటింగ్ నిర్వహించాలంటూ కొన్నినెలలుగా పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. గత మార్చిలో ఓహియో స్టేట్ లో ప్రైమరీ ఎలక్షన్ వాయిదా వేసినట్లే.. ట్రంప్ కూడా ఎలక్షన్ వాయిదా వేయొచ్చని అప్పటి నుంచి చర్చలు జరిగాయి. కానీ అమెరికన్ లా ప్రకారం నవంబర్ 3న ప్రెసిడెంట్ ఎన్నికల తేదీ ఫిక్స్ చేశారు. అలాగే అధ్యక్షుడు తిరిగి ఎన్నికైతే తప్ప.. తన టర్మ్ అయిపోయిన వెంటనే.. జనవరి 20న మధ్యాహ్నం ఆఫీసును వదలాల్సిందే. ఎమర్జెన్సీ ఉన్నా సరే.. ఈ సమయం తరవాత ఆఫీసులో ఉండేందుకు వీల్లేదు. ఒకవేళ దీనిని మార్చాలంటే మాత్రం రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుంది” అని నిపుణులు చెప్తున్నారు. అందువల్ల ట్రంప్ తిరిగి ఎన్నిక కాకపోతే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 20, 2021న ఆఫీసు వదిలివెళ్లాల్సిందేనని, ఎలాంటి మినహాయింపులు ఉండవని అంటున్నారు.

మాట మార్చిన ట్రంప్..
ఎన్నికల వాయిదా ప్రపోజల్ కు రిపబ్లికన్ లీడర్లనుంచీ పెద్దగా స్పందన రాకపోవడంతో ట్రంప్ వెంటనే మాటమార్చారు. “ఎన్నికలు వాయిదా వేయాలని కానీ, 3 నెలలు ఆగాలనీ నేను కోరుకోవడం లేదు. అప్పుడు బ్యాలట్లు మిస్ అయ్యాయని తెలిస్తే అందులో ఎలాంటి అర్థం ఉండదు” అని ట్రంప్ అన్నారు.

For More News..

అమెరికా జీపీఎస్‌‌‌‌‌‌‌‌కు డ్రాగన్ కంట్రీ సవాల్

సమస్యను కేటీఆర్ కు ట్వీట్ చేస్తే కేసులా!