ట్రంప్ గుండె గట్టిదే.. వయస్సు 79 ఏండ్లు.. గుండె వయస్సు మాత్రం 65 ఏండ్లే

ట్రంప్ గుండె గట్టిదే.. వయస్సు 79 ఏండ్లు.. గుండె వయస్సు మాత్రం 65 ఏండ్లే
  • మిలిటరీ మెడికల్​ సెంటర్​లో చెకప్
  • ట్రంప్ హెల్త్​పై రూమర్లకు చెక్ పెట్టేలా ప్రకటన విడుదల 

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం సూపర్​గా ఉందని అతని డాక్టర్​ బార్బబెల్లా తెలిపారు. మేరీల్యాండ్‌‌‌‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌‌‌‌లో జరిగిన చెకప్‌‌‌‌లో ఈ విషయం తేలిందన్నారు. ప్రస్తుతం ట్రంప్ 79 ఏండ్లు ఉన్నప్పటికీ. ఆయన గుండె వయస్సు మాత్రం 65 ఏండ్ల వయస్సులో ఉన్నట్టు చురుకుగా పనిచేస్తోందని చెప్పారు. ట్రంప్ ఇంటర్నేషనల్ ​టూర్​కు ముందు ఈ టెస్టులు చేశారు. 

శుక్రవారం వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌‌‌‌లో ట్రంప్ మూడు గంటలు ఉన్నారు. అక్కడ ల్యాబ్ టెస్టులు, ప్రివెంటివ్ హెల్త్ అసెస్‌‌‌‌మెంట్లు, అడ్వాన్స్‌‌‌‌డ్ ఇమేజింగ్ చేయించుకున్నారు. అలాగే, ఏడాదికి ఒకసారి ఫ్లూ షాట్, కొవిడ్-19 బూస్టర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వైట్​హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు. ట్రంప్‌‌‌‌కు బలమైన కార్డియోవాస్కులర్, పల్మనరీ, న్యూరలాజికల్, ఫిజికల్ పెర్ఫార్మెన్స్ ఉందన్నారు. ఏప్రిల్‌‌‌‌లో జరిగిన యాన్యువల్ ఫిజికల్‌‌‌‌ టెస్టులో అతను 9 కిలోలు తగ్గినట్టు తేలిందని, చురుకైన జీవనశైలితో ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు.

ట్రంప్ బొమ్మతో కాయిన్ ప్రతిపాదన..

డాలర్ కాయిన్‌‌‌‌పై ట్రంప్ బొమ్మను ముద్రించాలనే ప్రతిపాదన అమెరికాలో వివాదాస్పదంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చి 2026 నాటికి 250 ఏండ్లు అవుతున్న సందర్భంగా ట్రంప్ కాయిన్ తీసుకురావాలని ముద్రణాలయ విభాగం ప్రతిపాదించింది. ఒకవైపు, ట్రంప్ ప్రొఫైల్, మరో వైపు అతను పిడికిలి ఎత్తిన బొమ్మ అలాగే ’ఫైట్, ఫైట్, ఫైట్’ అని పదాలు ఉండేలా ముద్రించాలని యోచిస్తున్నారు.