ట్రంప్ అబద్ధాలను.. గోడపై అంటించిన్రు

ట్రంప్ అబద్ధాలను.. గోడపై అంటించిన్రు

డొనాల్డ్ ట్రంప్ చెప్పిన అబద్ధాలంటూ న్యూయార్క్ లోని సోహోలో ‘‘వాల్ ఆఫ్​ లైస్ (అబద్ధాల గోడ)”ను ఏర్పాటు చేశారు. ట్రంప్ తన నాలుగేండ్ల పాలనలో చెప్పిన అబద్ధాలు, తప్పుడు ప్రకటనలను చీటీల రూపంలో అంటించారు. రేడియో ఫ్రీ బ్రూక్లిన్ కు చెందిన ఫిల్ బుహెలర్, టామ్ టెన్నీ 100 అడుగుల పొడవుతో ఈ వాల్ ఏర్పాటు చేశారు. దానిపై మొత్తం 20వేల అబద్ధాలను అంటించి, ‘వాల్ ఆఫ్ లైస్’ అని పేరు పెట్టారు. ఇమ్మిగ్రేషన్, కరోనా వైరస్, ట్యాక్సులు, వాతావరణం, ఉద్యోగాలు, రష్యా, ఉక్రెయిన్.. ఇలా వివిధ అంశాలకు సంబంధించిన సమస్యలను కేటగిరీల వారీగా విడదీశారు. ఒక్కో అంశానికి సంబంధించి ట్రంప్ చెప్పిన అబద్ధాలను ఒక్కో కలర్ స్ట్రిప్ పై రాసి ఫెన్సింగ్ వాల్ పై అంటించారు. మొత్తానికి ఇదొక ఆర్ట్ పీస్ లాగా తయారైంది. ఈ గోడను పోలింగ్ పూర్తి కాగానే బుధవారం కూల్చేశారు.