లాక్ డౌన్ కంటిన్యూ చేసేది లేదు

లాక్ డౌన్ కంటిన్యూ చేసేది  లేదు
  • హెల్త్ ఎక్స్ ఫర్ట్స్ సూచనలను పట్టించుకోని అమెరికా ప్రెసిడెంట్

వాషింగ్టన్ : అమెరికాలో విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు మరికొంత కాలం లాక్ డౌన్ కొనసాగించాలన్న హెల్త్ ఎక్స్ ఫర్ట్ సూచనలకు ట్రంప్ నో చెప్పారు. ఇలాంటి వాటిని తాను యాక్సెప్ట్ చేసేదే లేదంటూ తేల్చిచెప్పారు. అమెరికాలో ఏర్పాటు చేసిన కరోనా టాస్క్ ఫోర్స్ కీలక సభ్యుడు, హెల్త్ ఎక్స్ ఫర్ట్ ఆంథోని పౌఛీ మరింత కాలం లాక్ డౌన్ ను కంటిన్యూ చేయాలంటూ సూచించారు. దీనిపై ట్రంప్ రియాక్ట్ అయ్యారు. లాక్ డౌన్ కొనసాగించాలి అనే సూచనలను ఎంత మాత్రం పాటించేదీ లేదన్నారు. ముఖ్యంగా వ్యాపార కార్యకాలాపాలు, స్కూల్స్ ఓపెన్ చేయవద్దంటూ సూచింనప్పటికీ స్కూల్స్ ను రీ ఓపెన్ చేస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు. కాస్త ఏజ్ ఎక్కువ ఉన్న టీచర్లు, ఫ్రొఫెసర్లు మరికొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని దీనికోసం స్కూల్స్ క్లోజ్ చేయాల్సిన పనిలేదన్నారు. వ్యాపార కార్యకలాపాలు, స్కూల్స్, కాలేజ్ లు ఓపెన్ చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పినప్పటికీ ట్రంప్ ఆ సూచనలను పట్టించుకోవటం లేదు. ముందు అమెరికా ఎకానమీని గాడిలో పెట్టాల్సిన అవసరముందంటున్నారు. ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలంటే అమెరికా ఎకానమీని సెట్ రైట్ చేయాలని ఆయన ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హెల్త్ ఎక్స్ ఫర్ట్ సూచనలను పట్టించుకోవటం లేదు. అటు అమెరికాలో రోజురోజు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ దాదాపు 85 వేల మంది కరోనా కరాణంగా చనిపోయారు.