కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్​లనే పుట్టింది: ట్రంప్

కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్​లనే పుట్టింది: ట్రంప్

వాషింగ్టన్: కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్​లోనే పుట్టిందని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్ చేశారు. చైనాలోని వూహాన్ ప్రావిన్స్ లోని ఒక వైరాలజీ టెస్టింగ్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ ఆవిర్భవించిదని, దీనికి సంబంధించిన వివరాలేవీ చెప్పలేనని శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. వారం రోజులుగా చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన ట్రంప్.. వైరస్ గురించి వారికి ముందుగానే తెలిసినప్పటికీ.. ప్రపంచం అంతటా విస్తరించేలా చేశారని మండిపడ్డారు. వైరస్ వూహాన్ వైరాలజీ ల్యాబ్​లోనే పుట్టిందని ఎలా చెప్పగలరు? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘‘అవును, నా దగ్గర బలమైన ఆధారాలున్నాయి. కానీ, మీకు చెప్పలేను, మీకు చెప్పడానికి నాకు అనుమతి కూడా లేదు”అని ట్రంప్ సమాధానమిచ్చారు. చైనాకు ప్రజా సంబంధాల ఏజెన్సీ లా పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిగ్గుపడాలన్నారు. కరోనాకు అడ్డుకట్ట వేయడంలో చైనా ఏమాత్రం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కరోనా ఎఫెక్టుతో అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, దీని పరిణామాలు చైనాపై చాలా డిఫ్రెంట్ గా ఉంటాయని ఆయన మరోసారి హెచ్చరించారు. చైనా వస్తువులపై సుంకాలు ఎక్కువగా వేస్తామన్నారు.

కరోనా వ్యాప్తికి చైనానే కారణమని ఆరోపిస్తున్న ట్రంప్ ఆ దేశం తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే హెచ్చరించారు. అయితే చైనాలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకుంటున్నామని, దానిపైనే దర్యాప్తు చేపట్టామని చెప్పారు. త్వరలోనే అన్ని విషయాలు బయటపడతాయన్నారు.

ట్రంప్ చేసిన ఈ కామెంట్లను ఒబామా ఆఫీస్ ఇంటలిజెన్స్ అధికారులు తోసిపుచ్చారు. వైరస్ మనుషుల నుంచి పుట్టిందా.. ల్యాబ్ లో పుట్టిందా అన్నదానికి.. చైనాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో ఆయన తీసుకోవాలనుకుంటున్న చర్యలకు ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. ట్రంప్ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.