వాషింగ్టన్: ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు 8 నోబెల్ అవార్డులు గెలవాల్సిందని అన్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ ఈ సందర్భంగా నోబెల్ అవార్డుల ప్రస్థావన తీసుకువచ్చారు. తాను ఇప్పటి వరకు 8 యుద్ధాలు ఆపానని.. ఆపిన ప్రతి యుద్ధానికి ఒక నోబెల్ అవార్డ్ అందుకోవాల్సింది కానీ ఒక్కటీ గెలవలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామం నోబెల్ బహుమతులు ప్రధానం చేసే నార్వేకు ఇబ్బంది కలిగించేదేనని పేర్కొన్నారు. అలాగే.. 2025 నోబెల్ శాంతి బహుమతి విజేత మరియా మచాడోను వచ్చే వారంలో కలుస్తానని, ఆమెకు హలో చెప్పడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
కాగా, ఇటీవల ట్రంప్‌కు నోబెల్ అవార్డ్ పిచ్చి పట్టుకున్న విషయం తెలిసిందే. తాను చాలా యుద్ధాలు ఆపానని.. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అవార్డుకు ఆయనే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు. పాకిస్థాన్, ఇజ్రాయెల్ వంటి పలు దేశాలు కూడా ట్రంప్‌కు నోబెల్ పీస్ ఫ్రైజ్ ఇవ్వాలంటూ సిఫారసు చేశాయి. కానీ ట్రంప్‌కు నిరాశే ఎదురైంది. 2025 సంవత్సరానికి గానూ వెనిజులాకు చెందిన కొరినా మచాడోను నోబెల్ శాంతి బహుమతి వరించింది. అయితే.. నోబెల్ విజేత మచాడో తన అవార్డును ట్రంప్‌కు అంకితం చేశారు.
►ALSO READ | లుట్నిక్ చెప్పింది ఉత్తదే.. ట్రంప్, మోడీ 8 సార్లు ఫోన్ మాట్లాడుకున్నరు: ఇండియా
