జిన్ పింగ్తో ట్రంప్ మీటింగ్ రద్దు!

జిన్ పింగ్తో  ట్రంప్ మీటింగ్ రద్దు!
  • భేటీ అయ్యేందుకు రీజన్​ ఏది లేదన్న ట్రంప్​ 
  • ఆ దేశంపై టారిఫ్​లు పెంచుతామని వెల్లడి 

వాషింగ్టన్:  చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ తో సమావేశం అయ్యేందుకు తనకు ఇప్పుడు ఎలాంటి కారణం కనిపించడం లేదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల చివర్లో సౌత్ కొరియాలో జరిగే అపెక్ (ఆసియా పసిఫిక్ ఎకానమిక్ కోఆపరేషన్) సమిట్ సందర్భంగా జిన్ పింగ్, ట్రంప్ భేటీ కావాల్సి ఉండగా.. ట్రంప్ ప్రకటనతో ఈ మీటింగ్ దాదాపుగా రద్దయిపోయింది. 

అమెరికాకు రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై చైనా గురువారం ఆంక్షలు విధించిన నేపథ్యంలో శుక్రవారం ట్రంప్ ఈ మేరకు తన ‘ట్రూత్ షోషల్’ వేదికగా స్పందించారు. ‘‘మరో రెండు వారాల్లో సౌత్ కొరియాలో జరిగే అపెక్ సమిట్ వద్ద ప్రెసిడెంట్ జిన్ పింగ్ ను నేను కలవాల్సి ఉంది. కానీ ఆయనను కలిసేందుకు ఇప్పుడు నాకు ఎలాంటి కారణం కనిపించడంలేదు” అని ఆయన పేర్కొన్నారు. అలాగే చైనాపై అదనపు టారిఫ్ లు విధిస్తామని ట్రంప్ వెల్లడించారు.