మల్లీ ట్రంప్ టారిఫ్ లొల్లి.. చైనాపై వంద శాతం అదనపు సుంకాలు

మల్లీ ట్రంప్ టారిఫ్ లొల్లి.. చైనాపై వంద శాతం అదనపు సుంకాలు

టారిఫ్ ల పేరున ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి టారిఫ్ వార్ స్టార్ట్ చేశారు. చైనాపై 100 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు శుక్రవారం (అక్టోబర్ 10) సంచలన ప్రకటన చేశారు. చైనా దిగుమతులపై అదనంగా టారిఫ్ లు విధిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా చైన్ అధ్యక్షుడు జిన్ పింగ్ తో సదస్సును క్యాన్సిల్ చేస్తామని ప్రకటించారు.

దిగుమతులతో పాటు సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్స్ పై ఆంక్షలు విధిస్తున్నట్లు యూఎస్ ప్రకటించింది. నవంబర్ 1 నుంచి లేదంటే అతి త్వరలో ఈ టారిఫ్స్, ఆంక్షలు అమలు అవుతాయని ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. దీంతో అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ మరోసారి తీవ్రతరం అయ్యింది. 

అమెరికాకు ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడమే ట్రంప్ అదనపు సుంకాల విధింపుకు కారణం. రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో జిన్ పింగ్ వ్యవహారం ఆగ్రహం తెప్పించేలా ఉందని ట్రంప్ మండిపడ్డారు. దక్షిణ కొరియాలో జిన్ పింగ్ తో ఏర్పాటు కానున్న సదస్సును క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

చైనా తయారు చేస్తున్న వస్తువులు, ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడం అన్ని దేశాలపై ప్రభావం చూపిస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. దీనికి ప్రతిగా ఇప్పుడు చైనా చెల్లిస్తున్న సుంకాలకు అదనంగా 100 శాతం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు ట్రంప్.