UNలో ట్రంప్ ప్రసంగం.. ఈసారి ఐక్యరాజ్య సమితిని టార్గెట్ చేసిన అమెరికా అధ్యక్షుడు

UNలో ట్రంప్ ప్రసంగం.. ఈసారి ఐక్యరాజ్య సమితిని టార్గెట్ చేసిన అమెరికా అధ్యక్షుడు

ట్రంప్ ఎక్కడుంటే అక్కడ వివాదం చెలరేగాల్సిందే. అది అబద్ధమైనా.. నిజమైనా.. నిర్మొహమాటంగా.. డైరెక్టుగా విమర్శలకు దిగుతూ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ట్రంప్ స్పెషల్.  ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ఉన్నదీ లేనిదీ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా.. అమెరికా ప్రెసిడెంట్ అంటే ఇలా కూడా ఉంటారా అన్నట్లుగా తయారైంది ఆయన వ్యవహారశైలి. లేటెస్టుగా ఐక్యరాజ్య సమితిని టార్గెట్ చేసిన ట్రంప్.. ఏకంగా అదే వేదికగా విమర్శలకు దిగారు. 

మంగళవారం (సెప్టెంబర్ 23, అమెరికాలో సోమవారం) ఐక్యరాజ్యసమితిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా యుద్ధాలు ఆపడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైందని విమర్శలకు దిగారు. ఐక్యరాజ్యసమితి తన ప్రాముఖ్యతను కోల్పోయిందని అన్నారు. 

ప్రసంగంలో భంగాగా తన నోబెల్ బహుమతి ఆశను మరోసారి బయటపెట్టారు అమెరికా ప్రెసిడెంట్.  భారత్‌-పాక్‌ యుద్ధాన్ని నేనే ఆపా-నంటూ మరోసారి పాడిన పాటే పాడారు. తొమ్మిది నెలల్లో 7 యుద్ధాలు ఆపానని చెప్పుకున్నారు.

►ALSO READ | Paracetamol row : పారాసిటమాల్ తో ఎలాంటి ప్రమాదం లేదు.. ట్రంప్ వ్యాఖ్యల్ని కొట్టపారేసిన WHO మాజీ సైంటిస్టు

ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పిన ట్రంప్.. ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్నా-నని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే నాకు అసలైన నోబెల్‌ బహుమతి అని వ్యాఖ్యానించారు.