కౌంటింగ్ ఆపండి‌‌.. కోర్టుకెళ్లిన ట్రంప్ వర్గం

కౌంటింగ్ ఆపండి‌‌.. కోర్టుకెళ్లిన ట్రంప్ వర్గం
  • కౌంటింగ్‌ ప్రాసెస్‌ ను తమను చూడనివ్వలేదని ఆరోపణ
  • వాదనలు వినకుండానే కొట్టేసిన పెన్సిల్వెనియా కోర్టు
  • ఎలక్షన్‌ పూర్తయ్యే వరకు కల్పించుకోలేమన్నఅమెరికా సుప్రీంకోర్టు

వాషింగ్టన్‌‌: డెమొక్రాట్ల ప్రెసిడెంట్‌‌ క్యాండిడేట్‌‌ జో బైడెన్‌‌ గెలిచిన మిషిగన్‌‌ రాష్ట్రం.. ఇంకా లెక్కింపు జరుగుతున్న జార్జియా, పెన్సిల్వెనియా లో కౌంటింగ్‌‌ ప్రక్రియపై అనుమానం వ్యక్తం చేస్తూ ట్రంప్‌‌ వర్గం కోర్టుకెక్కింది. లెక్కింపు జరుగుతున్న ప్రాంతాల్లో కౌంటింగ్‌‌ ఆపాలని కోరింది. చట్ట ప్రకారం పెన్సిల్వేనియా, మిషిగన్‌‌లలో కౌంటింగ్‌‌ ప్రక్రియను చూసేందుకు తమకు అనుమతివ్వలేదని ఆరోపించింది. ఆ తర్వాత వాళ్లకు కోర్టు కౌంటింగ్​ చూసేందుకు అనుమతి ఇచ్చింది. విస్కాన్సిన్‌‌లోనూ ఇదే జరిగిందని, అక్కడ రీ కౌంటింగ్‌‌ చేయాలని పట్టుబట్టింది. విస్కాన్సిన్‌‌లో లాసూట్‌‌ వేస్తామని ట్రంప్‌‌ పర్సనల్‌‌ లాయర్‌‌ తెలిపారు. జార్జియాలోని ఛాథమ్‌‌లో అక్రమంగా ఇల్లీగల్‌‌ బ్యాలెట్లను యాడ్‌‌ చేసినట్టు తమ అబ్జర్వర్‌‌ చూశారని ట్రంప్‌‌ వర్గం చెప్పింది. అక్రమ బ్యాలట్లతో డెమొక్రాట్లు ట్రంప్‌‌ను ఓడించాలని చూస్తే ఊరుకోమంది.

అబ్జర్వర్లకు చాన్స్‌‌ ఉంటే స్పేస్‌‌ ఇస్తరు: కోర్టు

కౌంటింగ్‌‌ ప్రాసెస్‌‌ను చూడటానికి అనుమతివ్వాలని పెన్సిల్వెనియాలో కోర్టులో ట్రంప్‌‌ వర్గం కేసేస్తే వాదనలు వినకుండానే కోర్టు కొట్టేసింది. ఎలక్షన్‌‌ బోర్డుకు సాధ్యమైనంత వరకు అబ్జర్వర్లకు స్పేస్‌‌ ఇస్తుందని చెప్పింది. మరోవైపు పెన్సిల్వెనియాలో లేటు ఓట్లను లెక్కించొద్దని సుప్రీంకోర్టుకు ట్రంప్‌‌ వర్గం వెళ్లింది. కానీ ఎలక్షన్‌‌ ప్రాసెస్‌‌ పూర్తయ్యే వరకు తాము కల్పించుకోబోమని కోర్టు చెప్పింది. పెన్సిల్వేనియాలో ఓట్లలో మోసం జరిగిందని, రిపబ్లిక్‌‌ ఓట్లను డెమొక్రాట్లకు వేయించారని ట్రంప్‌‌ వర్గం ఆరోపిస్తోంది. ఆ రాష్ట్రంలో ఎలక్షన్‌‌ అధికారులు మెయిల్‌‌ ఇన్‌‌ ఓటర్లకు డెడ్‌‌లైన్‌‌ను మరోసారి పెంచడంపై ట్రంప్‌‌ వర్గం కోర్టుకెక్కింది.

మిషిగన్‌‌లో చట్టాన్ని ఉల్లంఘించారు: ట్రంప్‌‌ వర్గం

మిషిగన్‌‌లో ఎలక్షన్‌‌ అధికారులు చట్టాలను ఉల్లంఘించారని ట్రంప్‌‌ వర్గం ఆరోపించింది. క్యాంపెయిన్‌‌ స్టాఫ్‌‌ తమను బ్యాలట్‌‌ డ్రాప్‌‌ బాక్స్‌‌లకు సంబంధించిన వీడియో చూడనివ్వలేదని మండిపడింది. ఆ బాక్సుల్లోని బ్యాలెట్లను వేరు చేయాలని కోర్టుకెక్కింది. జార్జియాలో లేటు ఓట్లను లీగల్‌‌ ఓట్ల నుంచి వేరు చేయాలని, ఆ తర్వాత లీగల్‌‌ ఓట్లపై డిసైడ్‌‌ చేయాలని కోర్టును కోరింది. విస్కాన్సిన్‌‌లో రీకౌంటింగ్‌‌కు ట్రంప్‌‌ వర్గం పట్టుబట్టడంపై ఎక్స్‌‌పర్ట్స్‌‌ స్పందించారు. 20 వేలకు పైగా ఓట్లు మారడం కష్టమని చెప్పారు. కాగా మిషిగన్​లో ట్రంప్​ వర్గం కేసును కోర్టు కొట్టేసింది.