ఫస్ట్ నాన్ ఇజ్రాయెలీగా.. ట్రంప్‌‌కు ఇజ్రాయెల్ అత్యున్నత అవార్డు

ఫస్ట్ నాన్ ఇజ్రాయెలీగా.. ట్రంప్‌‌కు ఇజ్రాయెల్ అత్యున్నత అవార్డు

జెరూసలెం: హమాస్​తో కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌ ట్రంప్‌‌కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవాన్ని అందించనున్నది.ట్రంప్‌‌కు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్‌‌ మెడల్‌‌ ఆఫ్‌‌ ఆనర్‌‌’ను ప్రదానం చేయనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్​ హెర్జోగ్‌‌ ప్రకటించారు. 

హమాస్ చెరలో రెండేండ్లుగా బందీగా ఉన్న ఇజ్రాయెలీ పౌరులను విడుదల చేయడంలో ట్రంప్ చేసిన కీలక పాత్రకు గుర్తింపుగా ఈ పురస్కారం ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ ప్రకటనలో ట్రంప్ "ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్" ను అందుకోనున్న మొదటి నాన్ ఇజ్రాయెలీగా నిలవనున్నారు. 

అలాగే, ప్రస్తుతం ఇజ్రాయెల్‌‌ పర్యటనలో ఉన్న ట్రంప్‌‌కు.. ఆ దేశ ప్రధాని బెంజమిన్‌‌ నెతన్యాహు కూడా స్పెషల్ గిఫ్ట్‌‌గా బంగారు పావురాన్ని బహుమతిగా అందజేశారు.