TS ECET 2024 : టీఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదల

TS ECET 2024 :  టీఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్స్ ఒక్కొక్కటిగా  రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష తేదీలను ప్రకటించారు.  మార్చి 5వ తేదీన టీఎస్‌ ఐసెట్‌  నోటిఫికేషన్‌ రిలీజ్ చేయనున్నారు.  మార్చి 7వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం జూన్‌ 4, 5 తేదీల్లో ఐసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. 

ఇక ఇప్పటికే  తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జేఎన్టీయూ హైదరాబాద్ ఈ పరీక్షలు నిర్వహించనుంది.