
హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల బీఈడీ అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్ ఎడ్ సెట్ ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో సాయంత్రం 4గంటలకు కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి రిజల్ట్ రిలీజ్ చేస్తారని ఎడ్ సెట్ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. కాగా, గతనెల 18న ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష జరిగింది. 31,725 మందికి గాను 27,495 మంది ఎగ్జామ్కు అటెండ్ అయ్యారు.