గురుకుల ఆన్ లైన్ క్లాసులపై గైడ్ లైన్స్ ఇవే

గురుకుల ఆన్ లైన్ క్లాసులపై గైడ్ లైన్స్ ఇవే
  • టీచర్లు, లెక్చరర్లు రోజు విడిచి రోజు హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఆన్ లైన్ క్లాసుల పై  ప్రభుత్వం మార్గదర్శ కాలు జారీ చేసింది. పిల్లలు లేకుండా స్కూళ్లకు ఎలా వెళ్లాలన్న గందరగోళానికి తెరదించుతూ వారంలో సగం రోజులు స్కూలుకు.. సగం రోజులు ఇంటి నుండి పనిచేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. రాష్ట్రంలో గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు  రోజు విడిచి హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పని చేయాలని ఆదేశాలిచ్చింది. 
మూడు రోజుల ఇంటి దగ్గర నుండి మరో మూడు రోజులు గురుకుల విద్యా సంస్థల నుండి టీచర్లు...లెక్చరర్లు  ఆన్ లైన్ క్లాసులు పర్యవేక్షించాలని సూచించింది. మొక్కుబడిగా కాకుండా ప్రతి ఆన్ లైన్ క్లాసులకు 100 శాతం మంది విద్యార్థులు హాజరు అయ్యేలా చూడాలని ప్రభుత్వం నిర్దేశించింది.