గర్భిణీ మృతికి కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకుంటాం

గర్భిణీ మృతికి కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకుంటాం

హైదరాబాద్: గద్వాలకు చెందిన గర్భిణీ మృతి చెందిన ఘటనపై ఆరుగురు డాక్టర్లను బాధ్యులుగా చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. డెలీవరీ కోసం గద్వాలకు చెందిన గర్భిణీ 200 కి.మీ దూరం ప్రయాణించింది. చివరికి కరోనా లేదని సర్టిఫికెట్ తీసుకొస్తేనే డెలీవరీ చేస్తామని డాక్టర్లు చెప్పారు. తర్వాత పేట్లబురుజు ఆసుపత్రిలో డెలీవరి చేశారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో తల్లీ బిడ్డలు ఏప్రిల్ 24వ తేదీన మరణించారు.

ఈ ఘటనపై లాయర్లు రాసిన లేఖపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ హాస్పిటల్ డాక్టర్లు ప్రశాంతి, రాధను బాధ్యులుగా చేర్చినట్లు తెలిపిన ప్రభుత్వం.. సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రి వైద్యురాలు అమృత, గాంధీ వైద్యులు మహాలక్ష్మి, షర్మిల, అపూర్వను బాధ్యులుగా చేర్చామని తెలిపింది. ఈ ఆరుగురు డాక్టర్లపై చర్యలు తీసుకుంటున్నామని మంగళవారం హైకోర్టుకు నివేదిక అందజేసింది ప్రభుత్వం.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్క మర్డర్ దాచడం కోసం 9 హత్యలు చేశాడు

V6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వ‌గ్రామానికి త‌ల్లీకూతుళ్లు 

నెటిజన్లు ఫిదా : బర్రె పగ తీర్చుకుంది.. ఆకతాయిల నడుం ఇరకొట్టింది